సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): నగరంలోని వివిధ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.3కోట్ల విలువైన 756కిలోల గంజాయితో పాటు 8గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 1234.06కిలోల పాపిస్టన్, 10కిలోల హాషిష్ ఆయిల్, కొకైన్, 10కిలోల గంజాయి చాక్లెట్లు, 6గంజాయి మొక్కలు, 1.315కిలోల ఎండు గంజాయిని దహనం చేశారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ కథనం ప్రకారం…నగరంలోని ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కాచిగూడ, మలక్‌పేట, సికింద్రాబాద్, నారాయణగూడ, ధూల్‌పేట ఎక్సైజ్ ఠాణాల పరిధిలో మొత్తం 219 కేసు ల్లో రూ.189కోట్ల విలువ చేసే 756.356కిలోల గంజాయి. 1.315కిలో ల ఎండు గంజాయి, రూ.62లక్షల విలువ చేసే పాపిస్టన్, రూ.37లక్షల విలువ చేసే కొకైన్, రూ.10లక్షల విలువ చేసే హాషిష్ ఆయిల్, రూ.2లక్షల విలవ చేసే ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాస్ట్స్ .. మొత్తం రూ.3కోట్ల విలువైన మత్తు పదార్థాలను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
కేసుల విచారణ పూర్తవడంతో ఈ మత్తు పదార్థాలను హై దరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ కేఏబీ శాస్త్రీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా, నందిగామ, ఈదులపల్లిలోని జీకే మల్టీకేవ్ ఇండియా ప్రైవేట్ కం పెనీలో సోమవా రం ఆబ్కారీ అధికారు ల సమక్షంలో దహ నం చేశారు. ఈ సందర్భం గా వివిధ కేసుల్లో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను పటుకున్న ఆబ్కారీ అధికారులు, సిబ్బందిని కమిషనర్ శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రీ, అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డిలు అభినందించారు.