నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అగస్టు4 (నమస్తే తెలంగాణ): చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్యాంగ్‌రేప్ కేసులో ఏ2గా ఉన్న కమలాకర్ శివకుమార్ అలియాస్ శివ (19)కు 25 ఏండ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జిల్లా జడ్జి అనిత సోమవారం తీర్పు వెల్లడించా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) రామ్‌రెడ్డి కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు బాలుడికి బాలికతో ఏర్పడిన పరిచయం..ప్రేమగా మారి.. ప్రేమిస్తున్నట్టు బాలికను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. నిందితుడు(ఏ2), మరో నిందితులు శివతోపాటు మరో మైనర్ బాలుడు (ఏ3)లను ఓయూ క్యాంపస్‌లో బాలికను పట్టుకుని గ్యాంగ్‌రేప్ చేసినట్టు రుజువైంది.
ఏ1,ఏ3లుగా ఉన్న ఇద్దరు మైనర్ బాలలపై జువైనల్ (మైనర్ బాలుర) ప్రత్యేక కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. బాలికపై ఏ-2గా ఉన్న నిందితుడు (మేజర్) శివ లైంగిక దాడిలో కీలకపాత్ర పోషించినట్టు కోర్టు విచారణలో రుజువైంది. సికింద్రాబాద్‌లోని నామాలగుండు ప్రాంతంలో నివస్తున్న బాధిత బాలికపై ముగ్గురు నిందితులు పథకం ప్రకారం బలవంతంగా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్టు బాలిక ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అధికారులు 2020లో కేసు నమోదు చేశారు. గ్యాంగ్‌రేప్ సమయంలో తీసిన వీడియో క్లిప్పింగ్‌ను వైరల్ చేస్తామని, తమకు డబ్బులు ఇవ్వాలని నిందితులు బాలికను బ్లాక్ మెయిల్ చేశారు.
కొంత డబ్బు బాలిక చెల్లించినప్పటికీ నిందితులు సంతృప్తి చెందకుండా అదనందా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. బాలికను మానసికంగా నిందితులు బాధిస్తుండడంతో ఒత్తిడిని తట్టుకోలేక పోలీసు లను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు సాక్షాధారాలను సేకరించిన తర్వాత గోపాలపురం ఏసీపీ వెంకటరమణ సమక్షంలో కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. సుధీర్ఘ విచారణ చేపట్టిన ప్రత్యే పోక్సో కోర్టు సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేసింది. నిందితుడు నేరం చేసినట్టు రుజువుకా వడంతో శివకు 25 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
న్యాయ సహాయ అధికారిణి టి.కల్పన నేతృత్వలో బాధిత బాలిక వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించడంలో సహకరించారు. సెషన్ హౌజ్ ఆఫీసర్ బి.అనుదీప్ ఆధ్వర్యంలో సాక్షులను కోర్టుకు సమర్పించేందుకు కానిస్టేబుళ్లు బి.తులసీదాస్, మహ్మద్ జుబేర్ కృషి చేశారు. బాధిత బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జరిమానా చెల్లించని సమక్షంలో నిందితుడు అదనంగా 6 నెలలపాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూచించింది.