సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురి కాకూడదని వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీఏ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. రవా ణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ ఎంతగానో ఆలోచన రేకెత్తిస్తోంది. రాను న్న వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు ఆ గణేశుడిని గుర్తు చేస్తూ.. ఆర్టీఏ అధికారులు పోస్టర్ ఏర్పాటు చేశారు. అందులో ‘తల మీదే రక్షణ మీదే’ ఒక తలపోతే రెండో తల పొందలేరు నాలాగ’ అంటూ ఆ లంబోదరుడే హెచ్చరిస్తున్నట్టు పోస్టర్లో రూపొందించారు.
దీంతో వాహన సేవలకోసం వచ్చిన వారంతా ఆ పోస్టర్ను చూసి హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను తెలుసుకుంటున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు సైతం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.