భక్తులపై కమిటీ నిర్లక్ష్యం వీడాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వీడాలని కమిటీ ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్, భిక్షపతిలు కోరారు. ఖైరతాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సలహాదారులు ఎం.మహేందర్ బాబు, అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. 67 ఏండ్లుగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కార్యవర్గం ఉన్నప్పటికీ సభ్యులందరినీ సంప్రదించకుండా కేవలం ఒకే కుటుంబానికి చెందిన వారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని
- లాభాపేక్షే ధ్యేయంగా కమిటీ కార్యకలాపాలు
- హుండీల లెక్కలు ప్రజలకు వివరించాలి
- గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 6: భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వీడాలని కమిటీ ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్, భిక్షపతిలు కోరారు. ఖైరతాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సలహాదారులు ఎం.మహేందర్ బాబు, అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. 67 ఏండ్లుగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కార్యవర్గం ఉన్నప్పటికీ సభ్యులందరినీ సంప్రదించకుండా కేవలం ఒకే కుటుంబానికి చెందిన వారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వారు తెలియజేశారు. గణేశుని చుట్టు పక్కల మొత్తం పదివేల మంది కుటుంబాలతో నివసిస్తున్నారని, నలు దిక్కులా బారికేడ్లు నిర్మించడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఆఫీసుకు పోయే ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సరైన దారి కల్పించాలని ఉత్సవ కమిటీని మంత్రి ఆదేశించారని, అయినా, కొందరు అధికారులు, ఉత్సవ కమిటీ వారు పట్టించుకోవడం కమిటీ ఉపాధ్యక్షులు పేర్కొన్నారు.
ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు భక్తుల కానుకల రూపంలో వస్తాయని, పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు ఎన్ని కానుకలు వేస్తున్నారనేది బహిరంగ పర్చాలని, వాటిని ఎవరి సంక్షేమానికి వినియోగిస్తున్నారని చెప్పాలన్నారు. జవాబుదారిగా లేనప్పుడు కమిటీని వెంటనే రద్దు చేయాలన్నారు. ఖైరతాబాద్‌లో మంత్రి హరీశ్ రావు చొరవతో ఎమ్మెల్యే దానం నాగేందర్ 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు మైకుల హోరుతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. చుట్టు పక్కల నివాస ఉండే వారికి అసౌకర్యం ఉంటుందని, శబ్ద కాలుష్యం పెరిగిందన్నారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గణేశుని వెనుక వైపు రోడ్డు నిర్మాణానికి తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు అత్యవసరంగా మంజూరు చేయించారని, కానీ, ఉత్సవ కమిటీలోని కొందరి చర్యలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం జరుగలేదని, ఈ కారణంగానే స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు బిక్షపతి, రాజు, ప్రసాద్, సూరి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

