మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 7: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ఏర్పాటు చేసి పూజించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ గణపతి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం భక్తులకు పంపిణీ చేశారు. వినాయకుడికి పట్టు పంచ, కండువా కోసం ఆలయలో ఏర్పాటు చేసిన మగ్గం పనులను మంత్రులు ప్రారంభించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. కలర్స్, కెమికల్స్‌తో తయారు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జయరాజ్, పాలక మండలి సభ్యులు, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహా ముదిరాజ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.