వాటా ఇచ్చుకో.. వ్యాపారం పెట్టుకో
గండిపేట చెరువు కాలువ(కాండూట్) కబ్జాలమయంగా మారడంతో ప్రమాదపుటంచున ఉన్నది. ఎక్కడపడితే అక్కడ వ్యాపార కేంద్రాలు వెలుస్తుండటంతో మురుగునీటితో కాండూట్ పూర్తిగా కలుషితమవుతున్నది.
- గండిపేట కాలువ కబ్జాలమయం
- ఎక్కడికక్కడ వ్యాపార కేంద్రాలు
- వసూళ్ల మత్తులో జలమండలి
మణికొండ, జూలై 20 : గండిపేట చెరువు కాలువ(కాండూట్) కబ్జాలమయంగా మారడంతో ప్రమాదపుటంచున ఉన్నది. ఎక్కడపడితే అక్కడ వ్యాపార కేంద్రాలు వెలుస్తుండటంతో మురుగునీటితో కాండూట్ పూర్తిగా కలుషితమవుతున్నది. పరిరక్షించాల్సిన జలమండలి అధికారులు, సిబ్బంది కాసుల కోసం కబ్జాలను ప్రోత్సహించి.. నెలవారీ ‘మామూళ్ల’కు తిలాపాపం తలాపిడికెడు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. కోకాపేట నుంచి మణికొండ మున్సిపాలిటీ పరిధి వరకు ఉన్న గండిపేట కాలువ వ్యాపార కేంద్రాలకు అడ్డాగా మారింది. కాండూట్‌కు ఇరువైపులా వంద అడుగుల దూరం వరకు జీవో 111 అమల్లో ఉంటుందని జలమండలి అధికారులకు స్పష్టంగా తెలుసు.. అయినా.. చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉంటాయి.
ఇదికాదన్నట్టు కాలువపైనే పలు వ్యాపార కేంద్రాలకు స్థలాలను కేటాయించి.. కొందరు జలమండలి సిబ్బంది నెలవారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కాండూట్ పరిరక్షణ కోసం నియమించబడ్డ సిబ్బంది చిన్న వ్యాపార కేంద్రాలపై జులూం చూపుతూ ప్రతి నెలా ఒక్కో దుకాణానికి రూ.5 నుంచి 7 వేల వరకు వసూళ్లు చేస్తున్నారని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇవ్వకపోతే కాండూట్పై దుకాణం పెట్టొదంటూ బెదిరిస్తారని వారు వాపోతున్నారు.
ఇటీవల పుప్పాలగూడ బీఆర్సీ ఎదురుగా వెలిసిన ఓ భవన నిర్మాణదారులు ఏకంగా కాండూట్పై టైల్స్ వేసి రహదారిని నిర్మించడంతో ‘నమస్తే’ దానిని వెలుగులోకి తీసుకొచ్చింది. అక్రమంగా ఏర్పాటు చేసిన టైల్స్, కాంక్రీట్‌ను తొలగించేందుకు జలమండలి సిబ్బంది అక్కడకు వెళ్తే.. ఓ ఉన్నతాధికారి ఫోన్‌చేసి.. సదరు బిల్డర్‌తో మంతనాలు జరుగుతున్నాయని, ఇప్పుడెందుకు తొలగించడం అంటూ క్షేత్రస్థాయి అధికారులకు తెలిపినట్లు తెలిసింది. రెండు రోజుల తర్వాత ఆ టైల్స్, కాంక్రీట్‌ను స్వయంగా సదరు బిల్డరే తొలగిస్తారంటూ స్థానిక అధికారులు తెలిపారు. కానీ నేటికి ఆ అక్రమ దారి అలాగే కొనసాగుతున్నది. అంతేకాకుండా మరో భారీ ట్రాన్స్ఫార్మర్ను సైతం నిర్మిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

