సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): సర్జరీ చేసేందుకు ఒక వైద్యుడు డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ షురువైంది. గాంధీ దవాఖానలో త్వరగా శస్త్రచికిత్స జరిపేందుకు ఒక వైద్యుడు రోగి వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు వారం రోజుల కిందట దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే.
దీనిని సీరియస్‌గా తీసుకున్న గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వచ్చిన ఫిర్యాదుపై నాలుగు విభాగాలకు చెందిన ప్రొఫెసర్లతో కూడిన కమిటీతో విచారణకు ఆదేశించారు. సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ విచారణను ప్రారంభించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో విచారణకు సంబంధించిన నివేదికను కమిటీ సూపరింటెండెంట్‌కు సమర్పించనున్నది. నివేదిక ఆధారంగా జరిగిన ఘటనపై డీఎంఈ తదుపరి చర్యలు తీసుకోనున్నారు.