Hyderabad | హైదరాబాద్ శివారు సూరారం డివిజన్ వైష్ణవి నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుడిలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు. సమీపంలోని గాజులరామారం అటవీ ప్రాంతంలో హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదుతో పరారయ్యారు.
ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. హుండీలో దాదాపు. 25 వేల వరకు కానుకలు ఉన్నాయని అర్చకులు తెలిపారు.
కాగా, వైష్ణవి నగర్లో మూడు రోజులుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు అపార్ట్మెంట్లలో దొంగతనాలు జరిగాయని.. మూడో రోజు ఏకంగా గణపతి ఆలయంలోనే హుండీని ఎత్తుకెళ్లారని కాలనీ వాసులు తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దొంగలు పేట్రేగిపోతున్నారని అన్నారు. అసలు పోలీసులు ఉన్నారో లేదా అర్థం కావడం లేదని.. గతంలో రెగ్యులర్గా పెట్రోలింగ్ చేసేవారని, ఇప్పుడు అసలు పెట్రోలింగ్ మాటనే లేదని వాపోతున్నారు.
సీసీటీవీ ఫుటేజ్..!
గణపతి ఆలయంలో హుండీ దొంగిలించిన దొంగలు
హైదరాబాద్ – కుత్బుల్లాపూర్లో వైష్ణవి నగర్లో వరుసగా మూడు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు
వరుసగా రెండు రోజుల నుండి అపార్ట్మెంట్ లలో సైతం జరుగుతున్న దొంగతనాలు
నిన్న ఏకంగా గణపతి ఆలయంలో హుండీ… pic.twitter.com/1Ws2sSjp4Q
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026