సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్)గా గజరావు భూపాల్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న జోయల్ డేవిస్ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో గజరావు భూపాల్‌కు పోస్టింగ్ కల్పించారు.
ఈ మేరకు ఆయన సోమవారం జోయల్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ గజరావు భూపాల్ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, మెరుగైన ట్రాఫిక్ మేనేజ్మెంట్కు కృషిచేస్తానని తెలిపారు.