అంబర్పేట, ఆగస్టు 20 : తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్అధ్యక్షుడిగా గిరివేని మహేష్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం అంబర్పేటలో తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి యాదగిరి ముదిరాజ్ ఆయనకు నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్ల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు తన ఎన్నికకు సహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.