Beautification of colonyes | కాలనీల సుందరీకరణకు నిధులు : ఎమ్మెల్యే మాగంటి
కాలనీల సుందరీకరణకు అవసరమైన నిధుల్ని మంజూరు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
వెంగళరావునగర్ : కాలనీల సుందరీకరణకు అవసరమైన నిధుల్ని మంజూరు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ జానకమ్మతోట ప్రాంతంలోని రూ.27 లక్షలతో ఫుట్‌పాత్‌ల సుందరీకరణ, రూ.9 లక్షలతో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ నియోవర్గంలోని కాలనీలను అందంగా తీర్చిదిద్దనున్నామని కాలనీ వాసులను అందులో భాగస్వాములుగా చేస్తున్నామని పేర్కొన్నారు. రహదారులు, మంచినీరు, డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కరిస్తున్నానని చెప్పారు.
నియోవర్గంలో అభివృద్ధి పనులను నిరంతరాయంగా కొనసాగిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, నాయకులు వేణు గోపాల్ యాదవ్, వేణు, చిన్న రమేష్, గజ్జల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

