సుల్తాన్ బజార్, జూలై 9: ల్యాబ్ టెక్నీషియన్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సేవ చే యాలనే సంకల్పంతో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎదిగారు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘ నాయకుడిగా సేవారత్న అవార్డు గ్రహీతగా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, 2014 నుం చి 2024 వరకు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన జిల్లా పరిధిలోని ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పించి, ఎంతో క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించి ఉద్యోగుల ఆదరణను చూరగొన్నారు. ఉద్యోగులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తూ జిల్లా పరిధిలోని 54 శాఖలకు విస్తరించేలా ఆయన తీసుకున్న చర్యలతో అందరు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆపద్బాంధవుడు టీఎనీ ్జవో కేంద్ర సంఘానికి ప్రధాన కార్యదర్శి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ఆయనపై పెరిగింది. ప్రభుత్వ శాఖలలో తన పని తాను చేసుకునే మనస్తత్వం కలిగిన ఉద్యోగులే అధికంగా ఉన్న నేటి సమాజంలో ఉద్యోగులకు ఆపద్బాంధవుడిగా ఉద్యోగేతరులకు తానున్నానని భరోసాను కల్పిస్తున్న ఏకైక వ్యక్తి సేవారత్న అవార్డు గ్రహీత టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ.
ల్యాబ్ టెక్నీషియన్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సేవ చే యాలనే సంకల్పంతో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎదిగారు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘ నాయకుడిగా సేవారత్న అవార్డు గ్రహీతగా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చే స్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో తనదైన శైలిలో పాల్గొని ఉద్యమ నాయకుడిగా పేర్గాంచారు. ఉద్యోగులకు ఏ సమస్యలు వచ్చినా తానున్నాంటూ ఆపన్న హస్తం అందిస్తున్న ఏకైక ఉద్యోగ సంఘ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలను గడించారనడంలో అతిశయోక్తి లేదు. ఉద్యోగుల సమస్యలతో పాటు సామాజిక బాధ్యతతో నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ముజీబ్ హుస్సేనీ సేవలను గుర్తించిన ఢిల్లీకి చెందిన విశ్వ కర్మ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను, ఢిల్లీకి చెందిన ‘ది న్యూస్ లైక్’ ఆంగ్ల మ్యాగ్జిన్ సంస్థ భారత్ కే ఆన్మోల్ బిరుదును, కోవిడ్ సమయంతో పాటు ఇతర సమయాలలో పెద్ద ఎత్తున రక్త దాన శిబిరాలను నిర్వహిస్తున్నందున ప్రభుత్వం గుర్తించి ఉత్తమ ఉద్యోగి అవార్డు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తమ ఉద్యోగి, క్రిస్టియన్ మైనారిటీ అసోసియేషన్ ఉద్యోగ రత్న, కోవిడ్ సమయంలో 56 రోజుల పాటు అందించిన సేవలకు గాను మహారాష్ట్రకు చెందిన ఆవిష్కార్ సోషల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ పవార్ సమాజ్ రక్షక్ విశేష్ సన్మాన పత్రాన్ని అందించి సత్కరించడంతో పాటు మరికొన్ని సంస్థలు అవార్డులను అందించి ఆయన సేవలను కొనియాడారు.
డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీకి చిన్న నాటి నుంచే సేవాగుణాన్ని అలవర్చుకున్నారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో పుట్టి పెరిగిన వాతావరణం కావడంతో కుల మతాలకు అతీతంగా సేవలు చేయడం అలవర్చుకున్నారు. 1991లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ లెదర్ టెక్నాలజీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించిన నాటి నుంచి తనకు వచ్చే ఆదాయంలో కొంత మేర పేద ప్రజలకు సేవ చేయాలని భావించారు. తన తల్లి దండ్రుల కోరిక మేరకు నెలలో నాలుగు సార్లు క్యాన్సర్ దవాఖానలోని రోగులకు, రోగులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కొవిడ్ వైరస్ వ్యాప్తితో పేదలు అల్లాడుతున్న సమయంలో తాను కొవిడ్‌కు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నాటి సీఎం కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల సూచనల మేరకు 56 రోజుల పాటు సుమాను పదివేలకు పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అంతే కాకుండాప్రాణాలను సైతం లెక్క చేయకుండా దవాఖానలలో నిత్యం విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకులను అందించి వారికి తానున్నానని భరోసా కల్పించారు. తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా డాన్ బాస్కో నవజీవన్ అనాథ ఆశ్రమంలో అనాథలకు బట్టలు, బ్యాగులతో పాటు యేడాదికి సరిపడా నిత్యావసర సరుకులను అందజేస్తూ అనాథల హృదయాలలో ముజీబ్ హుస్సేనీ చిరస్థాయిగా నిలిచిపోయారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు అసద్ అన్వర్ మోమెరియల్ ట్రస్ట్‌ను ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను కుటుంబ సభ్యుల తోడ్పాటు, ఉద్యోగుల సహకారం ఎన్నటికీ మరువలేనివి.
క్రమ శిక్షణకు మారు పేరు టీఎన్జీవో కేంద్ర సంఘం. అటువంటి సంఘానికి తనపై ఎంతో నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శిగా అప్పగించిన బాధ్యతను సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ నేతృత్వంలో సమర్ధవంతంగా నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాను. స్నేహ పూర్వక ప్రభుత్వంగా ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఉద్యోగులను చిన్నచూపు చూసిన ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవు. ఉద్యోగుల పోరాటాలేమి కొత్తవి కావు. తెలంగాణ ఉద్యమంలో పెన్‌డౌన్, సకల జనుల సమ్మె నిర్వహించి ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకురావడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పర్చడం, పెండింగ్‌లో ఉన్న డీఏలను, మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరాము.
కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదరించే సంఘం టీఎన్జీవో కేంద్ర సంఘం. టీఎన్జీవో సంఘంలో నాయకుడిగా చేరిన నాటి నుంచి ముజీబ్ హుస్సేనీ ప్రతి ఒక్కరికి తానున్నానని భరోసానిచ్చారు. ఎవరైనా తన వద్దకు వచ్చి బాధతో చేయి చాపితే తన వంతు ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఎంత క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించడంలో ముజీబ్‌కు ఎవరు సాటిరారు. తన చిన్ననాటి స్నేహితుడు రఘు దంపతులు మృత్యువాత పడితే వారి మరణంతో అనాథ అయిన స్నేహితుడి కుమార్తె దివ్యకు చదువుకు అయ్యే ఖర్చులన్నీ తాను భరిస్తానని తెలిపి రెండు పర్యాయాలు ఆర్థిక సహాయం అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మీడియా రంగంపై ఎంతో మక్కువ కలిగిన ముజీబ్ హుస్సేనీ ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వహించిన రాజేశ్ హఠాన్మరణంతో కలత చెందిన ఆయన సైదాబాద్‌లోని రాజేశ్ నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పిల్లల విద్యకు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీనిచ్చారు. దీంతో ఉద్యోగుల సమస్యలే కాదు. సామాజిక బాధ్యతతో ఇతరుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. సాధారణంగా సమాజంలో ఎవరైనా తన వర్గానికి చెందిన దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తారు. కానీ, దీనికి భిన్నంగా డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఇటు హిందువుల పండుగలలోనూ, క్రిస్మస్ వేడుకలతో పాటు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి యేడాది అమీర్‌పేట్‌లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మ వారికి బోనాలను సమర్పించడంతో పాటు తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నాంపల్లి భూ లక్ష్మమ్మ, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలోని కనక దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించేందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. అంతే కాకుండా యూసుఫెయిన్ బాబా దర్గాలో, డాన్ బాస్కోలో అనాథ చిన్నారులతో ప్రార్థనలను నిర్వహిస్తారు. 2015 నుంచి నిత్యం విధి నిర్వహణలో అలసిపోయే ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చేందుకు గాను టీఎన్జీవో స్పోర్ట్మీట్ను నిర్వహిస్తూ వస్తున్నారు. జిల్లా పరిధిలోని 54 శాఖల ఉద్యోగులు ఈ క్రీడలలో పాల్గొనడం గమన్హారం.
తోటి వారికి సాయం చేయాలని తన తల్లిదండ్రుల సూచనల మేరకు తనకు వచ్చే నెల వేతనంలో కాస్త పేదలకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో పేదలు పడిన ఇబ్బందులకు తాను చలించి మురికి వాడలతో పాటు పేద ప్రజలు నివసించే బస్తీలలో 56 రోజుల పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. సుమారు 10 వేలకు పైగా కుటుంబాలకు సహాయం చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందంటారు. మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే క్రమంలో అసద్ అన్వర్ మోమెరియల్ ట్రస్ట్‌ను స్థాపించారు. ప్రభుత్వం నుంచి ఈ ట్రస్ట్‌కు గుర్తింపు వచ్చింది. దీంతో ప్రతి నెల నాలుగు, ఐదు సార్లు మెహిదీ నవాబ్ జంగ్ క్యాన్సర్ దవాఖానలో పేద రోగి సహాయకులకు పౌష్టి కాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అంతే కాకుండా గాంధీభవన్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నోట్ బుక్‌ల పంపిణీ చేస్తున్నారు.