కీసర,డిసెంబర్ 9: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం కీసరలోని ప్రధాన చౌరస్తాలో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కార్యక్రమాన్ని కీసరలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయాదవ్, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మణ్‌శర్మ, పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.
తూకూంటలో..
శామీర్‌పేట: ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించడం అభినందనీయమని కాంగ్రెస్ నేత తోటకూర వజ్రేష్‌యాదవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉచిత బస్సు సదుయాలు ప్రారంభించినందుకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ప్రభాకర్‌గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు వైఎస్.గౌడ్, నర్సింలుయాదవ్, ఎంపీటీసీలు హనుమంత్‌రెడ్డి,ఇందిరా,శామీర్‌పేట కో ఆఫ్షన్ ముజీబ్, మాజీ సర్పంచ్‌లు ఎద్దు నాగేశ్‌యాదవ్, లక్ష్మీనారాయణ, బాబా పటేల్, రాజు, ఆనంద్, నర్మద, విజయ, నాగశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్,: మేడ్చల్ పట్టణంలోని బస్స్ డిపోలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం ప్రారం భించారు.ఈ కార్యక్రమంలో డీపో మేనేజర్ సుధాకర్, అధికారులు సుమంగళి, సువర్ణ, స్వాతి, స్నేహలత, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.