Free Training | బన్సీలాల్‌పేట్, మే 14 : వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులకు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్. నరసింహమూర్తి తెలిపారు. ముషీరాబాద్ చౌరస్తా సమీపంలో, భోలక్‌పూర్‌లోని తమ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఎయిర్ కూలర్, గీజర్ల రిపేరింగ్ నేర్పిస్తామని తెలిపారు. అలాగే, 15 రోజులపాటు హోమ్ క్లీనింగ్ కోర్సు గురించి ఉచిత శిక్షణ ఇచ్చి, అనంతరం సర్టిఫికెట్ కూడా అందించడం జరుగుతుందన్నారు.18 ఏళ్ల నిండిన వారు ఎవరైనా చేరవచ్చని ఆయన అన్నారు. వేసవి సెలవులు ఉన్న విద్యార్థులు ఈ శిక్షణకు హాజరై సమయం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు ఎం.శ్రీనివాస్, సెల్ నెంబర్ 81068 87523 లో సంప్రదించాలని ఆయన కోరారు.