గ్రూప్-1,2, పోలీసు ఉద్యోగార్థులకు పరీక్ష
16 వరకు ఛాన్స్.. అదేరోజు టెస్ట్
10 నిమిషాల ముందు కూడా ఐప్లె చేసుకోవచ్చు
క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్ మంచి అవకాశం కల్పించింది. గ్రూప్-1,2, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉపకార వేతనం కూడా అందించనున్నది. అందుకోసం ఈనెల 16న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆశన్న తెలిపారు. పరీక్షకు 10 నిమిషాల ముందు వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పత్రాన్ని బుధవారం హైదరాబాద్ కలెక్టర్ ఎల్.శర్మన్ విడుదల చేశారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి..