Medical camp | ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : శంషాబాద్ లిమ్స్ దవాఖాన చైర్మన్ డాక్టర్ రామ్రాజ్
శంషాబాద్ రూరల్ : ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ లిమ్స్ దవాఖాన చైర్మన్ డాక్టర్ రామ్రాజ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య విబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సుల్తాన్పల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచిస్పందన వచ్చి నట్లు ఆయన వివరించారు.
దీంతో పాటు గ్రామంలోని ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉచితంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు, లెన్స్ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు. వేయి మందికి పరీక్షలు అందించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేశామని వివరించారు.
ప్రజలకు ప్రతి ఏడాది ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్య గ్రామంగా తయారు చేస్తానని తెలిపారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని 27 గ్రామ పంచాయతీలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి తన్విరాజు,వైస్ ఎంపీపీ నీలంమోహన్నాయక్,పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు,నీరటి రాజు, డి శ్రీనివాస్,మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, ఎంపీటీసీ సంగీతసిద్ధేశ్వర్, ఉప సర్పంచ్ స్పందనగౌడ్, వార్డు సభ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

