సిటీ బ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వెనుకబడిన తరగతుల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా ప్రజలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించనున్నట్లు వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య తెలిపారు. నిరుద్యోగ బీసీ యువతకు టీజీఎస్ ఆర్టీసీ హకీంపేటలో ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హెవీ మోటార్ వాహనం, తేలికపాటి మోటార్ వాహనం నడిపేందుకు 38 రోజుల పాటు శిక్షణతో పాటు భోజనం, వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎనిమిదో తరగతి చదివిన 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వారు దరఖాస్తు పత్రాలను సంబంధిత జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఈనెల 31 లోపు అందజేయాలని సూచించారు. ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.