హిమాయత్‌నగర్, జూన్ 15: ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ఆదివారం కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆర్టిఫిషియల్ లింబ్, కాలిఫర్స్, ఫిట్మెంట్తో పాటు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణ్ సేవా సంస్థాన్ ట్రస్టీ డైరెక్టర్ దేవేంద్ర చౌబిసా, కో ఆర్డినేటర్ అల్కా చౌదరి తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరణ శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 39 ఏండ్లుగా వివిధ రాష్ర్టాల్లో దివ్యాంగులకు ప్రయోజనం కల్పించేందుకు సంస్థ కృషి చేస్తున్నదన్నారు. 2024 ఫిబ్రవరి 4న 1500 మందికి కొలతలు తీసుకోగా, వీరిలో 800 మందికి కృత్రిమ అవయవాలను అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో సామాజికవేత్త రితేశ్ జగీర్దార్, సంస్థ ప్రతినిధులు ఉత్తమ్ దామ్రాణి, మహేంద్రసింగ్రావత్, జస్మిత్ పటేల్, భగవాన్ ప్రసాద్ గౌర్ పాల్గొన్నారు.