ఈ మధ్య కొంత మంది అమ్మాయిలు ఈజీ మనీకోసం దొడ్డిదారులు తొక్కుతున్నారు. వయసులో ఉన్న యవకులను టార్గెట్ చేసుకుని డబ్బులు గుంజుతున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. ముఖం కనిపించకుండా స్కార్స్ కట్టుకుని పొలైట్‌గా లిఫ్ట్ అడుగుతారు. బండెక్కిన తరువాత కొంత దూరం వెళ్లగానే బేరం మొదలు పెడతారు. డబ్బులిస్తావా పోలీసులకు చెప్పాలా అని బ్లాక్మెయిల్ చేస్తారు. కొంత మంది బెదురుకుని ఎందుకొచ్చిన గొడవరా బాబు అని ఎంతో కొంత ఇచ్చి బయటపడతారు.
బంజారహిల్స్‌లో బుధవారం నాడు ఇలాంటి కేసు ఒకటి తగిలింది. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలోను ఓ మహిళను అరెస్టు చేశారు. బంజారహిల్స్ ప్రాంతంలో నివసించే ఓ కారు డ్రైవర్ మంగళవారం రాత్రి జూబ్లీ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్ పార్కు వైపు కారులో వెళ్తున్నాడు. చెక్‌పోస్టు వద్ద ఓ మహిళ అతన్ని లిఫ్ట్ అడిగింది. సరేలే రాత్రిపూట లేడీస్ గదా అని లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం వెళ్లగానే సదరు మహిళ బ్లాక్‌మెయిలింగ్ మొదలు పెట్టింది. తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే లైంగిక దాడికి పాల్పడ్డావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో షాక్‌కు గురైన ఆ కారు డ్రైవర్ అంతలోనే తేరుకుని కారు ఆపకుండగా నేరుగా బంజారమిల్స్ స్టేషన్‌కు కారును పోనిచ్చాడు. అక్కడున్న పోలీసులకు సీన్ వివరించాడు. సదరు మహిళను పోలీసులు విచారించగా ఆమె నయీమా సుల్తానా(32)గా తేలింది. ఆ మహిళ వద్ద లభించిన పుస్తకంలో చూడగా కొన్ని ముఖ్యమైన పత్రాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో 15 కేసులు నమైదైనట్టు పోలీసులు తెలిపారు. సో… ఎవరైనా సరె లిఫ్ట్ ఇచ్చే ముందు తస్మాత్ జాగ్రత్త!!