లాటరీ గెల్చుకున్నారని మీకు గుర్తు తెలియని నంబరు నుంచి మెసేజ్ వచ్చిందా? మీ ప్రమేయం లేకుండానే మీకు గిఫ్ట్ పంపిస్తామని ఎవరైనా మీకు కాల్ చేశారా? కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారా? డబ్బులు చెల్లిస్తామని ఎవరైనా క్యూఆర్ కోడ్ పంపించారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. అటువంటి ప్రకటనలు, మెసేజ్లు సైబర్ నేరగాళ్లవి అయి ఉండొచ్చు. గుర్తు తెలియని ఫోన్ నంబరు నుంచి అటువంటివి వస్తే ఒక్క క్షణం ఆలోచించండి. సైబరాబాద్ సైబర్ క్రైం ఫోన్ నంబరు 9490617310 లేదా 040-27854031కు డయల్ చేసి మాట్లాడండి. మీకు మెసేజ్, కాల్ వచ్చిన విధానాన్ని వివరించి సందేహాలు నివృత్తి చేసుకోండి. మీరు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీసులు మీకు సహాయం అందిస్తారు. ఉదయం 9 గం టల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆ నంబర్లలో సంప్రదించవచ్చని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.