వెంగళరావునగర్, నవంబర్ 4 : వస్ర్తాలు కావాలని ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్‌కు డెలివరీ పేరిట సరుకుతో ఉడాయించిన సంఘటనపై మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్‌లోని ఓ ఇంట్లో కార్తిక్ వదవతి అనే వ్యక్తి బోటిక్ నడుపుతున్నాడు. వస్ర్తాల స్టాక్ ఉంచి ఆర్డర్లకు సఫ్లయ్ చేస్తుంటారు. డుంజో డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ యాప్ ద్వారా గత నెల 30వ తేదీ మధ్యాహ్నం కొండాపూర్ నుంచి ఓ కస్టమర్ రూ.25వేలు విలువ చేసే వస్ర్తాలకు ఆర్డర్ ఇచ్చారు. సుళ్లూరు మహేశ్, ప్రవీణ్కుమార్లనే ఇద్దరు డెలివరీ బాయ్స్ మధురానగర్‌కు వచ్చి రూ.25వేలు విలువ చేసే వస్ర్తాలను డెలివరీ కోసం తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. అలా బట్టలు డెలివరీ పేరిట తీసుకెళ్లిన సుళ్లూరు మహేశ్, ప్రవీణ్‌కుమార్ క్యాన్సిల్ అయినప్పటికీ.. ఆ సరుకును తిరిగి తెచ్చివ్వలేదు. ఆ తర్వాత డెలివరీ బాయ్స్ ఇద్దరూ తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. దాంతో తాను మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.