కాచిగూడ, డిసెంబర్ 22: గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి నగదును తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం గోల్నాక డివిజన్లోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన మేడారం జంగయ్య(49)కు నితిన్‌జైన్ అనే వ్యక్తి ఓటీపీ తెలుసుకొని..అకౌంట్లోంచి రూ.57,600 వేలు తస్కరించాడు.
సికింద్రాబాద్, డిసెంబర్ 22: నౌక్రీ.కామ్ ద్వారా ఫోన్ చేస్తున్నట్లు చెప్పిన ఆగంతకుడు ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. దిల్‌ఖుష్‌నగర్‌కు చెందిన పాము అన్నపూర్ణ(24) అనే మహిళ వద్ద రూ.56,998లను కట్టించుకొని మోసం చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
కుత్బుల్లాపూర్,డిసెంబర్ 22: ఇంటిని అద్దెకు తీసుకుంటానని చెప్పిన ఓ మహిళ..అడ్వాన్సు పంపిస్తున్నానంటూ..జీడిమెట్లలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన అట్లూరి మంగిరెడ్డి ఖాతా నుంచి రూ.72 వేలను తస్కరించింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలానగర్, డిసెంబర్ 22 : ధని క్రెడిట్ కార్డులో లోన్ ఇస్తామని చెప్పి..పంచశీలకాలనీకి చెందిన బంటు మహేందర్ అనే వ్యక్తి వద్ద సైబర్ నేరస్తులు మొత్తం రూ. 30,000లు తస్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపారు. అలాగే రాంరెడ్డినగర్‌కు చెందిన సురుకంటి శ్రీనివాస్ అనే ప్రైవేటు ఉద్యోగి రూ. 7,672లు పోగొట్టుకున్నాడు.