సిటీబ్యూరో, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): రాంనగర్‌కు చెందిన చందులాల్ చౌదరీ వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్ లింక్‌ను క్లిక్ చేశాడు. పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటే నమ్మి.. రూ. 9.12 లక్షలు వరకు చెల్లించాడు. స్క్రీన్‌పై రూ. 65 లక్షలు కన్పిస్తున్నా అందులో ఒక్క పైసా కూడా డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో రమన్‌సింగ్ తన స్నేహితులు 15 మంది కలిసి హోప్క్లౌడ్ మనీ మేకింగ్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అందరు కలిసి రూ. 10.47 పెట్టుబడి పెట్టారు. ఒక్క పైసా కూడా తిరిగి రాకపోవడంతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.