సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ) /అంబర్‌పేట: ఇంట్లో పనిమనిషిగా చేరిన అత్త ఇచ్చిన సమాచారంతో అల్లుడు ఆ ఇంటికే కన్నమేశారు. భారీగా ఆభరణాలు, డబ్బు ఉన్నదని ఇచ్చిన సమాచారం మేర కు అల్లుడు.. కొంతమంది గ్యాంగ్‌తో కలిసి..ఇంటి యజమానులులేని సమయంలో దొంగతనానికి పాల్ప డ్డారు. 173తులాల బంగారం, రూ.17.5లక్షల సొమ్ము ను చోరీ చేశారు. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బషీర్‌బాగ్ అవంతీనగర్లో జరిగింది.
ఈ చోరీకి పాల్పడిన నలుగురిని ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.7కోట్ల విలు వైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అంబర్‌పేటలోని ఈస్ట్‌జోన్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బాలస్వామి, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందెశ్రీనివాసరావు, ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు.
బషీర్‌బాగ్, అవంతీనగర్లో నూకల రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగిందని ఈనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో లేని సమయంలో కిటికీగ్రిల్ తొలగించి.. సేఫ్టీలాకర్లో ఉన్న 173తులాల బంగారు ఆభరణాలు, రూ.17.50లక్షల సొమ్ము చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆనంద్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు కొంత సాంకేతికతను ఉపయోగించి ఈనెల 16న హైదరాబాద్ నుంచి పారిపోవాలనుకుంటున్న నలుగురు నిందితులను కుమ్మరవాడి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
అరస్టైన వారిలో కార్వాన్కు చెందిన చౌపల్ సాగర్‌కుమార్, బిహార్‌కు చెందిన ఆకాశ్‌కుమార్ మందల్, తాళ్లగూడకు చెందిన సైక్లెన్ఖాన్, దొంగసొత్తును కొనుగోలు చేసిన చంద్రశేఖర చౌపల్ ఉన్నారు. ఆశిశ్, శాలిని రచ్చు, అశ్విని రచ్చులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు సాగర్‌కుమార్ తన అత్త అశ్విని రచ్చు పనిచేస్తున్న నూకల రామకృష్ణ ఇంట్లో దొంగ తనానికి ప్లాన్ చేసి మిగతా ఆరుగురితో కలిసి చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అరస్టైన వారి నుంచి 158 తులాల బంగారం, రూ.10.75లక్షల డబ్బు, 8వాచ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పా రు. దొంగలను అరెస్ట్ చేయడంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ మత్తయ్య, నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జునలతో పాటు క్రైమ్, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రతిభకనబరిచాయని డీసీపీ తెలిపారు.