సిటీబ్యూరో, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువచేసే 2.1కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా విక్రయాలతో సంబంధం ఉన్న మరో ఐదుగురు వ్యాపారులతోపాటు 31మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి కథనం ప్రకారం… కార్వాన్ టోలీ మజీద్ ప్రాంతానికి చెందిన ఎండీ సలీంఖాన్, ఎండీ ఇంతియాన్ ఖాన్, వంశీకృష్ణ, సోను తమ నివాసంలోనే గంజాయి విక్రయిస్తారు.
సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు శుక్రవారం వారి ఇంటిపై దాడులు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువ చేసే 2.1కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న మరో ఐదుగురితో పాటు 31మంది వినియోగదారులపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ధూల్‌పేట సీఐ మధుబాబు, గోపాల్, ఎస్టీఎఫ్ ఎస్ఐ లలిత, భాస్కర్, హెడ్‌కానిస్టేబుల్, భాస్కర్‌రెడ్డి, అజీమ్, శ్రీధర్, కానిస్టేబుళ్లు ప్రకాశ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.