ఆర్కేపురం: చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం శ్రీ నగర్ కాలనీలోని తన నివాసంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ఈనెల 24 ఉదయం 10గంటలకు మీర్పేట్లోని ఎస్‌వైఆర్ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొనాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అరెకపుడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, యెగ్గే మల్లేశం, దయానంద్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, యువ నేత కార్తిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.