కొండాపూర్, అక్టోబర్ 28: చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు. నవంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి (సొంత పార్టీ) చేరనున్నట్లు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నవతారెడ్డి మాట్లాడుతూ.. ఇతర పార్టీలలో ఉన్న ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని, శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నవంబర్ 2న పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.