ఉప్పల్, డిసెంబర్ 14 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఈమేరకు గురువారం కేటీఆర్‌ను కలిసి మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌ను పరామర్శించి, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్‌రావు, ఏదుల కొండల్‌రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి కొకొండ జగన్, తదితరులు పాల్గొన్నారు.