అంబర్‌పేట, జనవరి 7: మండెపల్లి గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. గోల్నాకలోని సంఘం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘం సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. గౌరవ చైర్మన్‌గా మాల్ కాశీ రాం, అధ్యక్షుడిగా సందిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మాల్ యాదగిరి, కోశాధికారిగా మాల్ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా సిం గీతం శివరాజ్, మాల్ రవీందర్, బిజ్జి చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శులుగటా సింగీతం మురళీకృష్ణ, సందిరి అనిల్‌కుమార్, సంగీతం సాయిప్రసాద్, మాల్ శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా సింగీతం నర్సింగ్‌రావు, సింగీతం రాంప్రసాద్, సింగీతం సునీల్, మాల్ మల్లేశ్, మాల్ శ్రీనివాస్, సింగీతం శ్రీకాంత్, ఇంక కార్యవర్గ సభ్యులు, సలహాదారులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు.