సిటీబ్యూరో: హెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు ఓఆర్ఆర్, ముత్తంగి పరిసర ప్రాంతాల్లో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ముత్తంగి ఇస్తారా బాబాయ్లో వంటగది అపరిశుభ్రంగా, కొన్ని కూరగాయలు కుళ్లిపోయినవి, పాడైపోయినవి వంటివి గుర్తించారు. తయారు చేసిన ఆహారంలో ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తనిఖీలో తేల్చారు.
ముత్తంగి గుల్షాన్ హోటల్లో తయారు చేసిన ఆహార పదార్థాలతో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ది ప్లేస్-2లో వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లు తేల్చారు. ఫ్రిజ్లో వెజ్ అండ్ నాన్వెజ్ ఫుడ్స్ ఒకే చోట నిల్వ చేశారని గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటగది ఉందని, ఆహార ప్యాకెట్లకు లేబుల్స్ సరిగా లేవని తేల్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని గుర్తించి చర్యలు తీసుకున్నారు.