CCMB | సిటీబ్యూరో,నవంబర్ 10(నమస్తే తెలంగాణ): ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు హబ్సీగూడ సీసీఎంబీలో తనిఖీలు చేపట్టగా, వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణాన్ని గుర్తించారు. బొద్దింకలు, స్టోర్ రూంలో ఎలుకలు, వస్తువుల నిల్వ ప్రదేశంలో ఎలుకల మలం ఉన్నట్లు తేల్చారు. కిచెన్ ఫ్లోర్లో పాచి, పగిలిన పలకలు, రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన ఆహార ప్యాకెట్లకు లేబుళ్లు లేనట్లు గుర్తించారు.
వంట గదిలో తెరిచి ఉన్న డస్ట్బిన్లు, గడువు ముగిసిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నాచారంలో సిరి సుప్రభాత్ హోటల్లో తనిఖీలు చేపట్టి, టమోటాలు, బంగాళాదుంపలు కుళ్లిపోయినట్లు గుర్తించారు. ఫుడ్ హ్యాండర్లకు హెయిర్ క్యాప్స్ లేకుండా ఉన్నట్లు తేల్చారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.