హైదరాబాద్ : బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. పాఠశాల సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం కింగ్ కోఠి హాస్పిటల్కు తరలించారు.
16 మంది విద్యార్థులు కింగ్ కోటి హాస్పిటల్కు తరలించగా, మరో ఆరు మందిని నిలోఫర్ హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. కాగా, ఈ విషయంపై కింగ్ కోఠి మెడికల్ సూపరింటెండెంట్
సంతోష్ స్పందించారు.
విద్యార్థులు రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అందరి కండిషన్ స్టేబుల్గా ఉందని, పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.