పూల సాగు ఎంతో లాభదాయకం
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో పూల సాగుకు, ప్రధానంగా చామంతికి ఎక్కువ డిమాండ్ ఉన్నదని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు.
- తెలంగాణ వాతావరణ పరిస్థితులు అనుకూలం
- ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని ఫలితాలు
- ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి నీరజా ప్రభాకర్
వ్యవసాయ యూనివర్సిటీ , డిసెంబర్ 18 : తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో పూల సాగుకు, ప్రధానంగా చామంతికి ఎక్కువ డిమాండ్ ఉన్నదని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన చామంతి సాగుపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పూలకు, ప్రధానంగా చామంతికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. అందుకు అనుగుణంగా నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాల విడుదలైనట్లు చెప్పారు. వరి, ఇతర పంటలకన్నా, తక్కువ నీటి వనరులతో ఎక్కువ పంట దిగుబడి, లాభాలు రావడంతో పూల సాగు పెరిగిందన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, చెరువు, కుంటల కింద వరి సాగు చేయగా, బోరుబావుల కింద ఎక్కువగా కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడం, తెలంగాణ వాతావరణ పరిస్థితులు పూల సాగుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు. సమీపంలోని ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తల సలహా మేరకు సీడ్ కొని సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చన్నారు. తెలంగాణ లోని ఉమ్మడి మహబూబ్‌నగర్ , మెదక్, నల్గొండ, నిజామాబాద్‌తో పాటు, హైదరాబాద్ నగర చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పూల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. ఇటీవల విడుదలైన చీడపీడలను తట్టుకునే చామంతి రకాలను సాగు చేయాలని సూచించారు. నారు మళ్ల నుంచి, కోత, ఎగుమతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డా. భగవాన్, శాస్త్రవేత్త డా. నవీన్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

