సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) ః హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద నీరు చేరుతూనే ఉంది. ఇటీవల కురిసిన భారీ వానలతో నిండు కుండలా మారిన జలాశయాలను గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మూసీ నదీ పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నది.
ఇక సోమవారం సాయంత్రం ఆరు గంటల నాటికి ఉస్మాన్ సాగర్ నుంచి 600 క్యూసెక్కుల నీరు చేరగా, హిమయత్ సాగర్లోకి 2000 క్యూసెక్కుల మేర వరద నీరు చేరినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి వరద నీరు భారీ చేరుతుండటంతో హిమయత్ సాగర్ మూడు గేట్లను ఎత్తి 2400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా.. రాత్రి 8 గంటల వరకు మరో మూడు ఆడుగుల ఎత్తుకు చేర్చి 3000 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.