హైదరాబాద్ : నగర పరిధిలోని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 8వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ 13 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 1,789.10 అడుగులు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. అలాగే హిమాయత్‌సాగర్ ఎనిమిది గేట్లను ఎత్తి మూసీలోకి వరద నీటిని అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం 10,700 క్యూసెక్కుల వదిలారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు.