మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్‌పై ముగ్గురు..
బండ్లగూడ, జనవరి 28 : ట్రిపుల్ రైడిం గ్.. ఆపై అతివేగంతో వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఫ్లై ఓవర్‌పై విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు దవాఖానకు తీసుకువెళ్తుండగా మృతి చెందారు. ఈ ఘట న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పతేదర్వాజ ప్రాంతానికి చెందిన యూనస్ కుమారుడు మహ్మద్ అహ్మద్(14), సయ్యద్ శా మహ్మద్ఖాద్రీ(14), సైయ్యద్ ఇమ్రాన్(15)లు స్నేహితులు. జగ్నెకిరాత్ కావడంతో ఇంటి పక్కన ఉన్న హజ్జమ్ఖాన్ మసీదుకు వెళ్లి నమాజ్ చేసి వస్తామని చెప్పి బైక్ (టీఎస్12ఈజెడ్9577)పై ఈ ముగ్గురు బయలు దేరా రు.
మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటల కు బహదుర్‌పురా నుంచి ఆరాంఘర్ వైపు అతివేగంగా వస్తుండగా మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్‌పై బైక్ అదుపుతప్పి డివైడర్ మధ్య ఉన్న ఇనుప కరెంట్ స్తంభానికి ఢీకొన్నది. దీంతో సయ్యద్ శా మహ్మద్ ఖాద్రీ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మహ్మద్ అహ్మద్ తండ్రి యూనస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
నాన్నతో కలిసి స్కూల్‌కు వెళ్తుండగా..
లారీ టైర్ల కింద పడి బాలిక..
బంజారాహిల్స్, జనవరి 28: స్కూల్‌కు వెళ్లేందుకు తండ్రితోపాటు బైక్ మీద బయలు దేరిన పదేళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఫిలింనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. షేక్‌పేటలోని మైహోమ్ రెయిన్బో అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న గడ్దం హేమసుందర్‌రెడ్డి ఓ చానల్లో డిజిటల్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయన కుమార్తె గడ్డం అథర్వి(10) మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నది. మంగళవారం ఉదయం హేమసుందర్‌రెడ్డి.. తన కుమార్తెను స్కూల్లో దింపేందుకు యాక్టివాపై బయలుదేరారు.
ఉదయం 8.10 గంటల ప్రాంతంలో షేక్‌పేట నుంచి మణికొండ రోడ్డులో వెళ్తుండగా ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో చక్కెర లోడ్‌తో ఓఆర్ఆర్ వైపుకు వెళ్తున్న లారీ.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో యాక్టివాతో సహా హేమసుందర్‌రెడ్డి కుడివైపునకు పడిపోగా, అథర్వి ఎడమవైపు లారీ వెనకటైర్ల కింద కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఐదు నిమిషాల్లో స్కూల్‌వద్దకు చేరుకునేలోగానే తన కళ్లముందే కుమార్తె మృతి చెందడంతో హేమసుందర్ గుండెలు పగిలేలా రోధించడం అక్కడున్న వారందరికీ కన్నీళ్లను తెప్పించింది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషీని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్యూషన్‌కు వెళ్లి వస్తూ 10వ విద్యార్థి..
పీర్జాదిగూడ, జనవరి 28: ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా 10వ తరగతి విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం, కాచవానిసింగారంలో నివాసం ఉంటున్న మోతీరాం కుమారుడు తేజ చౌదరి(14) నారపల్లి దివ్యానగర్‌లోని నల్లమల్లారెడ్డి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై పర్వతాపూర్‌లో స్పాంజిల్లా గ్రేటర్ కమ్యూనిటీలో ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కాచవానిసింగారం సమీపంలోకి రాగానే ముందునుంచి వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో వెనకాల వస్తున్న తేజ టిప్పర్ ముం దు టైర్‌కు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తేజ టైర్ కింద పడిపోయి అక్కడిక్కడే మృ తి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.