Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని హఫీజ్పేట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న రుమాన్ హోటల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు మాదాపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది పేర్కొన్నారు. వంట గదిలో నూనె ఉండడం కారణంగా మంటలు త్వరగా వ్యాపించాయన్నారు. మంటలను అదుపు చేసేందుకు రెండు గంటలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కిచెన్లో ఉన్న పదార్థాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని పేర్కొన్నాడు.