మాదాపూర్ పీఎస్‌లో మంటలు
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం... స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు.
మాదాపూర్, జనవరి 22 : తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మాదాపూర్‌లో పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం భక్తులు పటాకులు కాల్చారు.
ఇందులో నుంచి చిన్న నిప్పురవ్వ ఎగిరి పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ సిలిండర్‌పై పడి పేలింది. దీంతో మిగిలిన మూడు సిలిండర్లూ పేలాయి. పోలీస్‌స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో పోలీస్ సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటీన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేసుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా పోలీస్ స్టేషన్ సమీపంలో పటాకులు కాల్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

