హైదరాబాహైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని పన్నుల విభాగంలో ప్రమాదం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మూడు ఫైరింజన్లను కార్యాలయానికి తరలించి, మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేడంతో భయంతో ఉద్యోగులు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లిఫ్ట్‌లో సిబ్బంది ఇరుక్కుపోయారు. ఐదో అంతస్తులో ఉన్న సిబ్బందిని కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల కారణంగా భారీగా పొగ కమ్మేసింది. మంటలకు పలు దస్త్రాలు కాలిబూడిదయ్యాయి. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.