Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో మద్యం లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశాడు. ఒక వైపు వాహనంలో మంటలు చెలరేగినప్పటికీ, మరో వైపు జనాలు మద్యం సీసాలను ఎగబడి ఎత్తుకెళ్లారు.
అయితే డీసీఎంకు విద్యుత్ వైర్లు తగలడంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం సంభవించినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు.
హైదరాబాద్ – హబ్సిగూడలో మద్యం లోడ్‌తో వెళ్తున్న డీసీఎంలో మంటలు
ఎగబడి మందు సీసాలను ఎత్తుకెళ్లిన జనం
వైర్లు తగలడంతో డీసీఎంలో చెలరేగిన మంటలు.. అప్రమత్తమై వాహనం నుండి దిగిపోయిన డ్రైవర్ pic.twitter.com/pKQMJ7GbMn
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2025