హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏషియన్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గోదాం అంతటా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గోదాం పక్కనే ఉన్న ఎన్ ఇంటిరీయర్ ఫర్నీచర్ దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. ఈ రెండు దుకాణాలకు సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.