Fire Accident : హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ వాయుపురి కాలనీలో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. నెక్సా కారు షోరూమ్ సమీపంలోని ఒక ఇంట్లో ఆదివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో వృద్ధుడు మృతి చెందాడు.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కాలనీ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. నిమిషాల్లోనే ఫైరింజన్‌తో వాయుపురికి చేరుకున్నారు సిబ్బంది. ఘటనా స్థలంలో వ్యాపించిన మంటల్ని ఆర్పేశారు. దాంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంటలు అంటుకొని కాలిన గాయాలతో మృతి చెందిన వృద్ధుడి వివరాలు తెలియాల్సి ఉంది.