హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు (Fire Accident) చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జిపై స్పేర్ కోచ్‌ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మరో కోచ్‌కు మంటలు వ్యాపించడంతో పెద్దఎత్తున పొగలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
కాగా, కోచ్‌లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. కేసు నమోదుచేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయనే విషయమై ఆరాతీస్తున్నారు. కాగా, రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మంటలు చెలరేగడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు.