Hyderabad | హైదరాబాద్ : పంజాగుట్టలోని ఓ హటల్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాన్‌బాగ్ హోటల్లోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో భయంతో హోటల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా..? అనే దానిపై స్పష్టత లేదు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.