మైలార్‌దేవ్‌పల్లి, జూలై 3: ప్రమాదవశాత్తు ఓ రబ్బర్ పరిశ్రమలో మంటలు చెలరేగిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్‌లోని నేతాజీనగర్‌లో రబ్బర్ పరిశ్రమంలో ఉదయం మంటలు చెలరేగుతున్నట్లు స్థానికులు గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.
అగ్ని మాపక సిబ్బంది వెంటనే రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో ఘటన స్థలానికి చేరుకొని దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షాట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు