Tata Nagar | మైలార్దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. పరుపుల గోదాంలో చెలరేగిన మంటలు
మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో (Tata Nagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున టాటానగర్‌లోని ఓ పరుపుల గోదాంలో (Mattress godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో (Tata Nagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున టాటానగర్‌లోని ఓ పరుపుల గోదాంలో (Mattress godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గోదాం మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా, షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

