బండ్లగూడ, నవంబర్ 20: బట్టల దుకాణంలో చెలరేగిన మంటలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో జరిగింది. శివరాంపల్లి గ్రామానికి చెందిన రవీందర్ తన ఇంట్లోనే బట్టలు దుకాణం నడుపుతున్నాడు.
బుధవారం మధాహ్నం బట్టల దుకాణంలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.