హిమాయత్‌నగర్, జనవరి 5: ప్రమాదవశాత్తు ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన నారాయణగూడ పోలీ స్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు, డీఎస్సై వెంకటేశ్ వివరా ల ప్రకారం.. హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిలో ఉన్న మినర్వా హోటల్లో ఆదివారం రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హో టల్లోని కిచెన్‌లో దట్టమైన పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి.
దీంతో హోటల్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అం దించగా..వారు అగ్ని మాపక సిబ్బందిని పిలిపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కిచెన్‌లో ఉన్న సామగ్రి, ఇతర వస్తువులు కాలిబూడిదైయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ సిబ్బంది భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.