Hyderabad | హైదరాబాద్లోని అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రూ వాల్యూ కార్ల షోరూంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.