Rangareddy | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని టాటానగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు.